తిరుపతి జిల్లా గూడూరులోని రాజావీధిలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 5న ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చి విహరించారు.