గూడూరు పట్టణ బీజేపీ కార్యాలయంలో ఆదివారం డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ అర్బన్ మండల అధ్యక్షుడు కే. దయాకర్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ ముఖర్జీ ఆశయాలు దేశానికి ఆదర్శమని, వారి సేవలు యువతకు మార్గదర్శకమని అన్నారు. కార్యక్రమంలో బాలకృష్ణం నాయుడు, గుంజి శ్రీనివాస్, నరేంద్ర, సురేష్ బాబు, గుమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.