తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండల పరిధిలోని తూపిలిపాలెం సముద్ర తీరంలో గురువారం గల్లంతైన ఇద్దరు విద్యార్థులలో శుక్రవారం లోకేష్ మృతదేహం లభ్యం కాగా శనివారం కొండూరు పాలెం సముద్ర తీరంలో భాను ప్రకాష్ మృతదేహం లభ్యమైంది. పంచినామా నిమిత్తం బాలిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.