గూడూరు పరిధిలో లీజు ముగిసిన శ్రీనివాస మైన్ లో అధికార పార్టీ నాయకులు కోట్ల రూపాయల క్వార్జ్ అక్రమంగా దోచేస్తున్నారని వైసిపి నాయకులు ఆరోపించారు. ఈ మైన్ సందర్శనకు MLC మేరిగ మురలీధర్ శనివారం వెళ్తారని చర్చ జరిగింది. సమాచారం తెలుసుకున్న గూడూరు రూరల్ పోలీసులు, శ్రీనివాస మైన్ ప్రైవేటు వ్యక్తులకు చెందిందని, ఎటువంటి అనుమతులు లేకపోవడంతో సందర్శనకు వెళ్లకూడదని సెక్షన్ 168 కింద ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చారు.