గూడూరు నియోజకవర్గం ఓజిలి తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) నిర్వహించాల్సి ఉంది. ఉదయం 10. 30 గంటల వరకు కూడా కార్యాలయంలో తహశీల్దార్ సహా సిబ్బంది ఎవరు హాజరు కాలేదు. ఫిర్యాదుదారులు మాత్రం కార్యాలయం వద్ద వేచి ఉంటున్నారు. కలెక్టర్ సమయపాలన పాటించాలని, ఉదయం 10 గంటలకే ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహించాలని ఆదేశించినా అధికారులు సమయపాలన పాటించడం లేదు.