గూడూరులోని సీఎస్ఎం ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాలను ఇతర పాఠశాలలో విలీన ప్రక్రియను నిలిపివేయాలని పట్టణ ముస్లిం మైనారిటీలు శుక్రవారం ఎమ్మెల్యేను కోరారు. మైనారిటీ నాయకులు ఎండీ. అబ్దుల్ రహీం, జమాలుల్లా, ఖమ్రుల్ ఇస్లాం, షఫీ మౌలానా, షబ్బీర్ పలువురు మైనారిటీలు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సానుకూలంగా స్పందించారు.