తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దుకాణదారులు అందరు కూడా వారి దుకాణాల ముందు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి కోరారు. బుధవారం సాయంత్రం ఆమె గూడూరు పట్టణంలో ట్రాఫిక్ రూల్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రాజా వీధి, గాంధీ బొమ్మ సెంటర్ నందు దుకాణదారులు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట సీఐ శేఖర్ బాబు, సిబ్బంది ఉన్నారు.