గూడూరు పట్టణ పరిధిలోని బనిగీసాహెబ్ పేట ప్రాంతంలో శుక్రవారం ఓ మహిళను లారీ ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానిక బనిగీసాహెబ్ పేటలో నివాసముంటున్న పర్వీన్ అనే మహిళ పనుల నిమిత్తం సెంటర్ కి వెళుతుంది. అదే సమయంలో నెల్లూరు వైపు నుంచి వెంకటగిరి వైపుకు వెళుతున్న ఓ లారీ వేగంగా వచ్చి పర్వీన్ ను ఢీకొంది. దీంతో పర్వీన్ రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలైన పర్వీన్ ను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.