తల్లికి వందనం పథకంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. వాకాడు మండలం తూపిలిపాళెంలో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని, ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు అందజేస్తున్నామని తెలిపారు. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వైసీపీ విషప్రచారం చేస్తోందని విమర్శించారు.