తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం వాకాడు మండలం తూపిలిపాలెం సముద్ర తీర ప్రాంతాన్ని ఎంపీడీవో అన్నపూర్ణ రావు గురువారం సందర్శించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తుఫాను కారణంగా సముద్రంలో దాదాపు 8 నుంచి 10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందన్నారు. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దుని మత్స్యకారులకు సూచనలు చేశారు.