ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై అక్కడి ప్రజలకు ఆయన వివరించారు. 2024 జూన్ 12న నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 20వ తేదీకి 100కి వంద రోజులు పూర్తి చేస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు.