ఫెంగల్ తుపాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో శుక్రవారం అర్ధ రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పట్టణంలోని రహదారులు, అండర్ బ్రిడ్జిలు జలమయమయ్యాయి. అదే విధంగా ప్రజలు, వాహనదారులు, కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు వానలు కురుస్తాయిని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది.