తిరుపతి జిల్లా రేణిగుంట గ్రామ పంచాయతీలో మంగళవారం పారిశుధ్య పనులు నిర్వహణ కార్యక్రమం చేపట్టారు. వీధిలో ఉన్న తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. మురుగు నీరు ఉన్న చోట మరియు పురవీధుల్లో బ్లీచింగ్ చల్లించారు. ప్రధాన కాలువల్లో పూడిక తీయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బాలసుబ్రమణ్యం రెడ్డి మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.