తమ సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు మంగళవారం గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ కు అర్జీలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో గూడూరు పట్టణం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. వాటిని పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ వారు ఎమ్మెల్యేతో చెప్పుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజలతో కిటకిటలాడింది. ఎమ్మెల్యే వారి వినతులను స్వీకరించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.