గూడూరులో అన్న క్యాంటీన్లు గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఐదు రూపాయలు చెల్లించి అక్కడే భోజనం చేశారు. భోజనం రుచికరంగా ఉందని పేదలందరూ ఈ అన్న క్యాంటీన్ ను వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టారన్నారు.