గూడూరు నియోజకవర్గం పెళ్లకూరు మండల వెలుగు కార్యాలయాన్ని తిరుపతి జిల్లా పీడీ శోభన్ బాబు గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన ప్రాజెక్ట్ అమలవుతున్న ఓఎన్డీసీ, స్త్రీనిధి, ఉన్నతి పథకాలపై సిబ్బందిని సమీక్షించారు. పలు కార్యాలయ రికార్డులను తనిఖీ చేశారు. ప్రాజెక్ట్ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలలో ప్రగతి సాధించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఆదినారాయణ, హేమమాలిని, రమణమ్మ తదితరులు ఉన్నారు.