గూడూరు పురపాలక సంఘ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో కుక్కలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వీధుల్లో సంచరిస్తూ దారిన వచ్చే పోయే వారిపై ఇవి దాడి చేస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వాహనాలపై వెళ్లే వారిని కూడా వెంబడిస్తూ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. మున్సిపాలిటీ వారు కుక్కలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.