చిన్నారిపై లైంగిక దాడి కేసులో ఏడేళ్లు జైలు

74చూసినవారు
చిన్నారిపై లైంగిక దాడి కేసులో ఏడేళ్లు జైలు
బాలికపై లైంగిక దాడి చేసిన ఘటనలో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 5వేలు జరిమానా పడింది. ప్రత్యేక పోక్సో జిల్లా కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. గూడూరులోని చవటపాలేనికి చెందిన వీరయ్య 2015లో బాలికకు మిఠాయి ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప అమ్మమ్మ ఫిర్యాదుతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్