వాకాడు: వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి

51చూసినవారు
వాకాడు: వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి
వాకాడు మండలం దుగ్గవరం గ్రామంలోని అరుంధతి వాడలో కొండాపురం స్వర్ణలత (26)అనే మహిళ గువారం అనుమానాస్పదంగా మృతి చెందింది. కోట మండలం విద్యానగర్ కు చెందిన స్వర్ణలత తొమ్మిదేళ్ళ క్రితం దుగ్గవరం గ్రామానికి చెందిన పరుశురామును కులాంతర వివాహం చేసుకుంది.గత కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య మనస్పర్దాలు చోటుచేసుకుని గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి గొడవ జరగగా స్వర్ణలత స్పృహకోల్పోయి కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు వాకాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.

సంబంధిత పోస్ట్