కుప్పం మండలం, చెక్కునత్తం పంచాయతీ సచివాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతిని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ నిలిచిపోయిందన్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.