కుప్పం మండలం నడుమూరు పంచాయతీలో ఉన్న సచివాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో కేంద్ర బృందం సచివాలయాన్ని తనిఖీ చేసింది. సచివాలయంలోని పంచాయితీ రికార్డులు, సూర్యఘర్ పథకం అమలు తీరును కేంద్ర బృందం శుభదీప్ దాస్, సత్యేంద్ర పరిశీలించారు. కేంద్ర బృందం వెంట ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఉన్నారు.