కుప్పం పట్టణంలోని ఏఆర్ ఆస్పత్రిని మంగళవారం కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్, పోలీసులు, వైద్యులు కలిసి తనిఖీ చేశారు. ఆస్పత్రి నడుపుతున్న అరుణ్ అనంత్ వద్ద విద్యార్హత పత్రాలు లేవని గుర్తించి, నకిలీ వైద్యుడిగా నిర్ధారించి ఆస్పత్రిని మూసివేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్యాధికారులు నిర్లక్ష్యంపై పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.