గుడిపల్లె మండలం సోడిగానిపల్లె సచివాలయం వద్ద 29న ప్రజా దర్బారు మన పంచాయతీ వద్దకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కడ పీడీ వికాస్ మర్మత్ బుధవారం పేర్కొన్నారు. ఈ ప్రజా దర్బార్ కు గ్రామ పంచాయతీలోని ప్రజలు హాజరై సమస్యలు తెలిపి పరిష్కారం చేసుకోవాలని ఆయన సూచించారు. అన్ని శాఖల అధికారులు హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు.