చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం సోడిగానిపల్లి సచివాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో 329 అర్జీలు వచ్చినట్లు కడ పీడీ వికాస్ మర్మత్ పేర్కొన్నారు. ప్రధానంగా హౌసింగ్162, రెవెన్యూ 62, పెన్షన్ 52 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించినట్లు ఆయన స్పష్టం చేశారు.