కుప్పం : ఆస్తి పన్నులో 5శాతం రాయితీ

77చూసినవారు
కుప్పం : ఆస్తి పన్నులో 5శాతం రాయితీ
కుప్పం నగర పాలక సంస్థకు సంబంధించి 2025 -26 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను మొత్తాన్ని ముందస్తుగా ఏకమొత్తంగా ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించిన వారికి 5 శాతం రాయితీ లభిస్తుందన్నారు. ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లించి అసలులో ఐదు శాతం రాయితీ పొందాలన్నారు.

సంబంధిత పోస్ట్