కుప్పం పట్టణంలోని పైబాటలో గురువారం ఇరువర్గాల ఘర్షణలో పలువురు గాయపడ్డారు.అదే ప్రాంతానికి చెందిన యువతితో తమిళనాడు చెందిన యువకుడికి వివాహం జరిగింది. వారి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో, పెద్దలు పంచాయతీ నిర్వహిస్తుండగా ఘర్షణ రేగింది. ఈ ఘర్షణలో పలువురు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారిస్తున్నారు.