హత్యాయత్నం కేసులో నిందితుడు తాండవ కృష్ణను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కనమనపల్లెకు చెందిన మణికంఠపై భూ వివాదం విషయంలో హతమార్చేందుకు దాడి చేసి పరారీలో ఉన్న తాండవ కృష్ణను గుడుపల్లె రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.