చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని వసనాడు గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీవో హరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులను పారదర్శకంగా చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మస్టర్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.