శాంతిపురం మండలంలోని మల్లూరు కృష్ణాపురం గ్రామంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు జయరామ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.