కుప్పం: రెస్కో కార్యాలయంలో త్రాగునీటి సమస్య

75చూసినవారు
కుప్పం: రెస్కో కార్యాలయంలో త్రాగునీటి సమస్య
కుప్పం రెస్కో కార్యాలయంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యాలయంలో వందలాది మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు. అయితే ఉద్యోగులతో పాటు వినియోగదారులకు కూడా తాగునీరు అందించలేని పరిస్థితి రెస్కోలో నెలకొంది. తాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వతంగా నీటి ఫిల్టర్లు ఏర్పాటు చేసి దాహం తీర్చాలని వినియోగదారులు విన్నవించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చొరవ తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్