కుప్పం బైపాస్ రోడ్డులో బుధవారం పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు నుంచి శాంతిపురం వైపు ఓ మిల్క్ లారీ బయల్దేరింది. కుప్పం బైపాస్ రోడ్డులోని విజలాపురం క్రాస్ వద్దకు రాగానే క్యాబిన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డు పక్కన పార్క్ చేసి పరుగులు తీశాడు. తర్వాత డీజిల్ ట్యాంకుతో పాటు ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో స్థానికులు పరుగులు తీశారు.