కుప్పం: జీవితంలో స్నేహబంధం ఎంతో విలువైంది

83చూసినవారు
ప్రతి ఒక్కరికి జీవితంలో స్నేహ బంధం ఎంతో విలువైందని పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో టీచర్లు పేర్కొన్నారు. రామకుప్పం మండలం పంద్యలమడుగు జడ్పీ ఉన్నత పాఠశాలలో 2011-12లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. 12 ఏళ్ల తర్వాత అందరూ ఓ చోట చేరారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్