చిత్తూరు జిల్లా కుప్పంలో వెలసిన తిరుపతి గంగమ్మ ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. ఈ సందర్భంగా హుండీకి రూ.21,31,050 నగదు, 71 గ్రాముల బంగారం, 169 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఛైర్మన్ రవిచంద్రబాబు, ఆలయ ఈవో కమలాకర్ తెలిపారు. 7 నెలలకు గాను ఈ కానుకలు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.