కుప్పం పట్టణాభివృద్ధి సంస్థ (కాడా)కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రణాళికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో కుప్పంను అథారిటీగా ప్రకటించినప్పటికీ తర్వాత అది నిలిచిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2023 జూలైలో కాడాను పునరుద్ధరించారు. తాజాగా దీనికి స్వయం ప్రతిపత్తి కల్పించి, చిత్తూరు కలెక్టర్‌ను ఛైర్మన్‌గా నియమించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.