కుప్పం పట్టణం ప్యాలెస్ రోడ్డులో ఉన్న ఏఆర్ హాస్పిటల్లో మంగళవారం కడ పిడి వికాస్ మర్మత్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఆస్పత్రి నిర్వహణకు సంబంధించి ఇక్కడ వైద్యం చేస్తున్న వ్యక్తి గురించి ఆరా తీయగా ఇక్కడ వైద్యం చేస్తున్న వ్యక్తి నకిలీ డాక్టర్ అని తేలింది. దీంతో ఆసుపత్రిని సీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పిడి తెలిపారు. కార్యక్రమంలో కుప్పం డి. ఎస్. పి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.