కెనమాకులపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బడుగుమాకులపల్లిలో ప్రతి ఆదివారం జరిగే వారపు సంత బహిరంగ వేలంను బుధవారం పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ బహిరంగ వేలం ద్వారా హెచ్చు దారులు దక్కించుకున్నారు. కెనమాకులపల్లి గ్రామపంచాయతీకి వారపు సంత వేలం ద్వారా మొత్తం రూ. 26, 60, 000 ఆదాయం వచ్చిందని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.