కుప్పం నియోజకవర్గంలోని హనుమంతు కొట్టాలు గ్రామ సమీపంలో ఓ గుడిలో చోరీకి ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు చాకచక్యంగా శనివారం పట్టుకున్నారు. అతడు తమిళనాడు రాష్ట్రం వానియబడి జిల్లా తిమ్మంపేటకు చెందిన మునుస్వామిగా గుర్తించారు. బైక్ పై వచ్చి ఆలయం గేటు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అతడిని అప్పగించారు.