గుడిపల్లి మండల పరిధిలోని కంచిబందార్లపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు గుడిపల్లి ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. కనుమనపల్లికి చెందిన సత్యవేలును అదుపులోకి తీసుకుని, సుమారు రూ.15 వేలు విలువ చేసే కర్ణాటక మద్యం, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.