గుడిపల్లి మండలంలోని గణేష్ పురం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిన ఘటన బుధవారం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గుడుపల్లి పోలీసుల కథనం మేరకు, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వెంకటాచలం శాంతిపురం మండలం కడపల్లిలో బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయాలైన వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు.