చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపీగా సులోచన, వైస్ ఎంపీపీగా వెంకటరమా గౌడ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.