సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 14న కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శాంతిపురం మండలంలో జరిగే శ్రీ సిద్ధేశ్వర పెద్దదేవర జాతరలో భువనేశ్వరి పాల్గొననున్నారు. పదేళ్లకు ఒకసారి కురవ కులస్తులు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ జాతరలో పాల్గొని అనంతరం రాళ్ల బూదుగూరు శ్రీ కోదండ రామస్వామి రథోత్సవంలో సైతం పాల్గొంటారని సమాచారం.