భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ జయంతిని సోమవారం కుప్పంలో ఘనంగా సోమవారం నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు ఘటించారు. టీడీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన పుష్ప పల్లకీని పట్టణంలో ఊరేగించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ దళిత నేతలతో కలిసి ఎమ్మెల్సీ శ్రీకాంత్ కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.