కుప్పంలో పాడిపరిశ్రమ అభివృద్ధికి సిఎం చంద్రబాబు చర్యలు చేపట్టారని కడ పిడీ వికాస్ మర్మత్ పేర్కొన్నారు. గురువారం కుప్పం మండలంలోని దాసేగానూరులో పశుసంవర్థకశాఖ ద్వారా రాష్ట్రీయ గోకుల్ మిషన్ అధ్వర్యంలో ఆవులకు ఉచిత కృత్రిమ గర్భధారణ సీరం ఇంజక్షన్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. రూ. 1300ల విలువ చేసే లింగ నిర్ధారిత కృత్రిమ గర్భధారణ సీరం ఇంజక్షన్లను పాడి ఆవులకు ప్రభుత్వం తరపున ఉచితంగా వేస్తున్నట్లు చెప్పారు.