తిరుపతి గంగమ్మ బుధవారం విశ్వరూప దర్శనమిచ్చారు. అమ్మవారి విశ్వరూప సందర్శనం తర్వాత పేరంటాల్లు చెంప నరకడంతో జాతర ముగిసింది. అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. 7రోజుల పాటు ఘనంగా నిర్వహించిన గంగమ్మ జాతర బుధవారం విజయవంతంగా ముగిసింది. భక్తులు వివిధ వేషధారణలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.