చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలోని మదనపల్లి గ్రామ పంచాయతీలోని రైతుల సేవా కేంద్రంలో వేరుశనగ విత్తనాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు అన్ని విధాలా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.