కుప్పం: యువత పోరు నిర్వహించే అర్హత వైసీపీకి లేదు

84చూసినవారు
కుప్పం: యువత పోరు నిర్వహించే అర్హత వైసీపీకి లేదు
యువతను మోసం చేసిన వైసీపీకి యువత పొరు కార్యక్రమాన్ని నిర్వహించే అర్హత లేదని తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మణి విమర్శించారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కనీసం ప్రయత్నం చేయలేదన్నారు. కూటమీ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు, ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారి సంక్షేమానికి సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్