కుప్పం మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన కంగుందిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. యోగ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు