మదనపల్లి సర్వజన బోధనాసుపత్రి వైద్య కళాశాల పాలనాధికారి పల్లం రాజు (56) శుక్రవారం మృతి చెందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శివరాం తెలిపారు. రాయచోటి నుంచి ఫిబ్రవరి నెలలో బదిలీపై మదనపల్లి మెడికల్ కాలేజీకి వచ్చారు. సంబేపల్లికి చెందిన పల్లం రాజుకు భార్య రాజ్యలక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు. విధులకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చిన పళ్ళెం రాజుకు గుండెపోటు రావడంతో స్వగృహంలోనే మరణించారు.