హార్సిలీ హిల్స్ లో దుప్పి ని చంపిన వేటగాడిని అరెస్టు చేసినట్లు శనివారం మదనపల్లి ఎఫ్ఆర్ఓ జయప్రసాద రావు తెలిపారు. హార్సిలీ హిల్స్ లో శుక్రవారం వేటగాళ్లు దుప్పిని చంపినట్లు సెక్షన్ ఆఫీసర్ శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. కురబలకోట మండలం తెట్టు మండెం వారి పల్లికు చెందిన మజ్జిగ శివను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.