కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన కోళ్ల వాన్ డ్రైవర్ దామోదరం (49) ఆత్మహత్య చేసుకున్న ఘటన బంగారుపాళెం మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. యాదమరి మండలం సీఆర్ కండ్రిగకు చెందిన ఆయన మద్యం అలవాటు కారణంగా కుటుంబ సభ్యులు మందలించగా, కొత్తపల్లె రోడ్డులో వాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.